నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి బుధవారం పోలీసుల విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని, విచారణకు అందుబాటులోకి వచ్చేందుకు రెండు రోజుల గడువు కావాలని పోలీసులకు లేఖ రాశాడు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులకు మెయిల్ పంపించాడు. మే 8న మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణకు హాజరుకావాలని పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. అయితే, తక్కువ సమయంలో నోటీసులు అందాయని, తనకు రెండు రోజుల సమయం కావాలని భగీరథ్ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని సూచించాలని కోరారు.
పోలీసులకు బండి భగీరథ్ లేఖ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



