ఇరాన్ తో యుద్ధమే కారణం
వాషింగ్టన్ : ఇరాన్ తో చేస్తున్న యుద్ధం అమెరికాను ఆర్థికంగా ఇబ్బందిపెడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా, ఇప్పటి వరకు 29 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యిందని పెంటగాన్ బడ్జెట్ అధికారి, యూఎస్ చట్టసభ సభ్యులకు మంగళవారం తెలిపారు. గతంలో యూఎస్ కాంగ్రెస్కు పెంటగాన్ సమర్పించిన 25 బిలియన్ డాలర్ల అంచనా బడ్జెట్ను ఇది అప్పుడే దాటేసిందని పేర్కొన్నారు. అయితే ఈ అంచనాలు యూఎస్ యుద్ధ విభాగానికి సంబంధించిన తక్కువ స్థాయి ఖర్చులను మాత్రమే చూపుతోందని, మొత్తం వ్యయం ఏకంగా 1 ట్రిలియన్ డాలర్లు నుంచి రెండు ట్రిలియన్ (రూ.లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల ) వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధ బడ్జెట్ నిపుణురాలు లిండా బిల్మ్స్ మాట్లాడుతూ, “ఇరాన్తో చేస్తున్న యుద్ధం వల్ల అయిన ఖర్చు రూ. లక్ష కోట్లకు పైనే చేరుకునే అవకాశం ఉందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను” అని అన్నారు. స్వల్పకాలిక, ముందస్తు ఖర్చుల కోసమే రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతోందని, ఇది కేవలం పైకి కనిపించే ఖర్చు మాత్రమేనని, అసలు ఖర్చులు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. కాగా, ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యకు ఇప్పటి వరకు దాదాపు 29 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యిందని పెంటగాన్ కంప్ట్రోలర్ జే హర్ట్స్ మంగళవారం హౌస్ అప్రోప్రియేషన్స్ కమిటీ విచారణ సందర్భంగా తెలియజేశారు.
సీఎన్ఎస్ కథనం ప్రకారం, ‘అమెరికా యుద్ధ పరికరాల మరమ్మత్తులు, కొత్త ఆయుధాల భర్తీ, యుద్ధరంగంలో ఉన్న సిబ్బందికి అయ్యే సాధారణ కార్యాచరణ ఖర్చుల కారణంగానే ఈ బడ్జెట్ పెరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన సరైన అంచనాలు మాత్రం తమ దగ్గర లేవని పేర్కొంది. అయితే అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే అసలు సంఖ్య ఇంకా పెద్దగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. బహుశా ఈ యుద్ధ ఖర్చు 40 నుంచి 50 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని ఓ అంచనా వేసింది’.
పెంటగాన్ ఊహించని ఖర్చులు!
కొన్ని పరిశోధనల ప్రకారం, ఖరీదైన క్షిపణి వ్యవస్థలు వేగంగా క్షీణించడం, సైనిక నిర్వహణ ఖర్చుల వల్ల, యుద్ధం ప్రారంభమైన మొదట్లోనే అమెరికాకు కనీసం 16 బిలియన్ డాలర్లు అయ్యింది. ఇది పెంటగాన్ ఊహించని దానికంటే చాలా ఎక్కువ. ‘మేము అసాధారణ వేగంతో యుద్ధ సామగ్రిని ఖర్చు చేస్తున్నాం. గత నాలుగేళ్లలో ఉక్రెయిన్కు సరఫరా చేసిన దానికంటే, ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే యూఎస్ పెద్ద సంఖ్యలో పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించాం’ అని లిండా బిల్మ్స్ పేర్కొన్నారు. క్షిపణులు, ఇంటర్సెప్టర్ వ్యవస్థలు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల విస్తరణ, యుద్ధభూమి ఉన్న సైనికుల వేతనాలు, దెబ్బతిన్న సైనిక ఆస్తుల నిర్వహణ, భర్తీ వంటివి ఉన్నాయి. వీటికి రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది. అయితే పెంటగాన్ అంచనా వేసిన దానికంటే, అవుతున్న ఖర్చులు భారీగా ఉన్నాయి. ఉదాహరణకు, ఇన్వెంటరీలో టోమహాక్ క్షిపణుల విలువ ఒక్కొక్కదానికి 2 మిలియన్ డాలర్లుగా ఉంది.
కానీ ఈ రోజు వాటిని భర్తీ చేయడానికి 3 నుంచి 3.5 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతోంది. ఇన్వెంటరీలో పేట్రియాట్ క్షిపణుల విలువ 1 నుంచి 2 మిలియన్ డాలర్లు ఉంది. కానీ కొత్త వెర్షన్ ధర ఒక్కొక్కటి 4 నుంచి 5 మిలియన్ డాలర్లు వరకు ఉంటుంది. ఇంధనం, ఇతర సరఫరాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది’ అని బిల్మ్స్ అన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో దెబ్బతిన్న యూఎస్ సైనిక స్థావరాల మరమ్మతులకు, క్షిపణి, ఇంటర్సెప్టర్ ఉత్పత్తిని పెంచడానికి లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి కంపెనీలతో పెద్ద ఎత్తున రక్షణ ఒప్పందాలు చేసుకున్నాం. ఇది కూడా మధ్యకాలిక ఖర్చులో భాగంగా ఉందని బిల్మ్స్ తెలిపారు. “ఇరాన్తో యుద్ధం కోసం మేము కచ్చితంగా ఒక ట్రిలి యన్ డాలర్లు ఖర్చు చేస్తామని నేను నమ్ముతున్నాను. బహుశా మేము ఇప్పటికే ఈ మొత్తాన్ని చేరి ఉండవచ్చని భావిస్తు న్నాను. పెరిగిన రక్షణ వ్యయం సుమారు 31 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా జాతీయ అప్పును గణనీయంగా పెంచే అవకాశం ఉంది” అని బిల్మ్స్ హెచ్చరించారు.
అమెరికాకు ఏకంగా రూ.లక్షకోట్లకుపైగా నష్టం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



