- Advertisement -
పాడేమోసిన సర్పంచ్, ఉప సర్పంచ్
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ అన్నారు. గురువారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రామిడి మొగిలి (60)గుండెపోటుతో మృతిచెందారు. నాలుగేళ్ళ క్రితం మొగిలి తనయుడు రవి రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం మొగిలి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ లు హాజరై అంత్యక్రియల్లో పార్టీవాదేహానికి నివాళులర్పించి, పాడే మోశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దన్నపనేని అశోక్ రావు,గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



