Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంప్రయివేటు బస్సు- తార్ ట్యాంకర్ ఢీ.. నలుగురు సజీవదహనం

ప్రయివేటు బస్సు- తార్ ట్యాంకర్ ఢీ.. నలుగురు సజీవదహనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గుజరాత్‌లోని రాజ్‌కోట్-చోటిలా హైవేపై సాంగాణి గ్రామం సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ నుండి రాజ్‌కోట్ వైపు వెళ్తున్న ప్రయివేటు బస్సు, ముందు వెళ్తున్న తార్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి సుమారు 1:30 నుండి 2 గంటల మధ్యలో ట్యాంకర్ టైర్ పేలి నియంత్రణ తప్పడం, వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -