Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లతో లబ్ధిదారుల్లో ఆనందం..ఎమ్మెల్యేకు సర్పంచ్ కృతజ్ఞతలు

ఇందిరమ్మ ఇండ్లతో లబ్ధిదారుల్లో ఆనందం..ఎమ్మెల్యేకు సర్పంచ్ కృతజ్ఞతలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషి ఫలితంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో లబ్ధిదారుల్లో ఆనందాలు వ్యక్తం అవుతున్నాయని గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ అన్నారు. మద్నూర్ మండలంలోని తడి ఈప్పర్గా గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా, ఉపసర్పంచ్ అంజనీ ప్రహ్లాద్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఊరూరా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇంటిని నిర్మించుకున్న లబ్ధిదారుల్లో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ నూతన ఇంటిని ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షునికి గ్రామ సర్పంచ్ అశ్విని, సుదర్శన్ మున్నా శాలువాతో సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -