Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రైవేటు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు

ప్రైవేటు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు

- Advertisement -
  • – ఎస్ఎస్ సి టాపర్లకు సన్మానం
    నవతెలంగాణ – వేల్పూర్ / ఆర్మూర్ 
  • మండలంలోని చేపూర్ గ్రామ ఉన్నత పాఠశాల యందు ప్రైవేటు వద్దు ప్రభుత్వం పాఠశాలలో ముద్దు అంటూ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో
    ప్రాధానో పాధ్యాయురాలు చేతన కుమారి,  ఉప సర్పంచ్ చరణ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మినుగు నాగరాజు, ఉపాధ్యాయులు సంఘం అశోక్, రవి, గంగాధర్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
    • మోతే పాఠశాలలో విద్యార్థులకు సన్మానం…

మండలంలోని మోతే  గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతిలో 500 పై మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను మోతే సర్పంచ్  డోల్లా రమేష్ రెడ్డి గురువారం  ఘనంగా సత్కరించారు. పాఠశాలలో మొదటి ర్యాంక్ సాధించిన కుమారి కే శృతిక కు 5000/- రూపాయలు, రెండవ ర్యాంకు సాధించిన బ్లేస్సి  విద్య లకు చెరి ఒక్కొక్కరికి 2500/- రూపాయలను క్యాష్ ప్రైజ్ గా , సర్పంచ్  అందజేశారు. అంతేకాకుండా 500 పై మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శాలువా, పూలదండలతో, సత్కరించి ప్రశంసా పత్రాలను క్యాష్ ప్రైస్ అందజేశారు. 

విద్యార్థులకు 10వ తరగతి పునాది లాంటిదని, దీనిలో మంచి మార్కులు సాధించి, మొదట మెట్టు పూర్తి చేసి కళాశాల విద్య లో ఇంకా కష్టపడి చదివి మోతే గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని సూచించారు. పి ఆర్ టి యు కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ సర్పంచ్ కట్ట పాఠశాల అభివృద్ధి కొరకు తన ఐదు సంవత్సరాల వేతనాన్ని ఇస్తున్నారని, విద్యార్థులను ప్రోత్సహించడంలో గ్రామ ప్రథమ పౌరుడు ముందుండి తన యొక్క ధర్మాన్ని ముందుండి పాటిస్తారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, పి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శి నరసింహారావు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ శ్రీమతి భూదేవి, వి డి సి స్పీకర్లు ద్యాగ రాజన్న,కల్లా రాజేందర్, విడీసీ  సభ్యులు ప్రవీణ్, మనోహర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు మంచి గణేష్, మహేందర్, రత్నయ్య, శ్రావణ మంచిర్యాల సురేష్ కుమార్, వెంకట నరసయ్య, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -