నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల ఆన్ లైన్ వేగవంతం చేయాలని తహసిల్దార్ నరేష్ అన్నారు. బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామం దాని పరిధిలోని తండాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల ఆన్ లైన్ ఎంతవరకు వరకు పూర్తయ్యిందనే వివరాలను బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్యుమరేషన్ శాతం తక్కువగా నమోదైనందున వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్యుమరేషన్ ఫామ్ తప్పనిసరిగా ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని బూత్ లెవెల్ అధికారులకు సూచించారు. ఓటర్ల డాటా ఎంట్రీలో ఎలాంటి పొరపాటు జరగకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు.ఎన్యుమరేషన్ లో పొరపాటు జరిగితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు శరత్ కుమార్, ప్రదీప్, సూపర్ వైజర్ దీపక్, బూత్ లెవెల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి: తహశీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



