Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జక్రాన్ పల్లిలో ఘనంగా విద్యా వారోత్సవాలు

జక్రాన్ పల్లిలో ఘనంగా విద్యా వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఘనంగా విద్యా వారోత్సవాలు నిర్వహించినట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధారాణి తెలిపారు. విద్యా వారోత్సవాల సందర్భంగా పాఠశాల విద్యా సంచాలకుని ఆదేశాల మేరకు, తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ జక్రాన్ పల్లి లో ర్యాలీ నిర్వహించి, తరగతి టాపర్లకు, పాఠశాల టాపర్లకు బహుమతులు పంపిణీ చేసి, పేరెంట్స్ టీచర్ మీటింగ్  ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించబడ్డాయి. పిల్లల తల్లిదండ్రులకు మధ్యన భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సుధారాణి, కంచరి రవికుమార్, ఇఫ్రా, గంగరాజు, నజీర్, సత్యం, సాధికా, శంకర్, సుకన్య, బాలరాజు, సాయి, రహీం, సురేష్, రాజేష్, సుదర్శన్, వివేక్, నవీన్, స్రవంతి తదితర టీచర్లు తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -