- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : రోజురోజుకూ ఎండలు మండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు,ముగజీవాలు దాహార్తికి అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు ఎండనుంచి ఉపశమనం కోసం గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి,ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ మజ్జిక ప్యాకేట్స్, చల్లని తాగునీరు అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అక్కల మహేష్,కోడారి ఐలయ్య,కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



