Thursday, May 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలి: యండి జహంగీర్  

బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలి: యండి జహంగీర్  

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ రాజకీయ వత్తిడికి పోలీసులు లొంగి అరెస్టు చేయడం లేదని, వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన  తెలిపారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్ మాట్లాడుతూ.. భాద్యత కలిగిన స్థానంలో ఉన్న మంత్రి బండి సంజయ్ చట్టంపై గౌరవం ఉంచి తన కొడుకును అప్పగించాలని డిమాండ్ చేశారు. పైగా మంత్రి బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడడాన్ని చూస్తే కేసును తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని భావించారు.

కొత్త పార్టీ పెట్టిన కవిత మాటలు భగీరత్ ను వెనుకేసు కోచ్చేవిధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాచార కేసులపై కఠినంగా ఉండాలని అన్నారు.

రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ అత్యాచార సంఘటనల పట్ల బీజేపీ ద్వంద విధానాన్ని అనుసరిస్తుందని, మోడీ పాలనలో మహిళలకు భద్రత కొరవడిందని వెంటనే బండి భగీరథ్ ను అరెస్టు చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు 

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయకిష్ణ, ఈర్లపల్లి ముత్యాలు, బందెల ఎల్లయ్య, బర్ల వెంకటష్, లలిత, అంజయ్య రాహుల్ రాంబాబు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -