Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ కార్యాలయంలో మీఓటు-మీ బాధ్యత ప్రత్యేక శిబిరం

తహశీల్దార్ కార్యాలయంలో మీఓటు-మీ బాధ్యత ప్రత్యేక శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) వేగంగా తప్పులు లేకండా పూర్తి చేసేందుకు ఈ నెల 16-17 రోజుల్లో తహశీల్దార్ కార్యాలయంలో మీఓటు- మీభాద్యత ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నామని తహశీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో భాగంగా ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు నింపని వారు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. తప్పులు లేకుండా, తమ ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు ఓటర్లు విధిగా ఫారాలను నింపి క్యాంపులో అందజేయాలని సూచించారు. మండల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -