నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పమ ఎంపీడీవో. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకంలో నిర్మించన నూతన గృహాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ సర్పంచ్. వి. రమణ సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి భరద్వాజ్ తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలో మంజూరైన నూతన గృహాలను మార్కౌట్ వేసి పనులను ప్రారంభించారు. అదేవిధంగా బస్వాపూర్ గ్రామపంచాయతీలో ప్రతి ఇంటింటా జనగణ సర్వే కొనసాగుతుంది ఈ సర్వే ను పర్యవేక్షించడానికి జుక్కల్ మండల అభివృద్ధి అధికారి, ఈజిఎస్, మండల ఈసీ, స్వామీ దాస్ జనగణ సర్వే అధికారిని ఇమ్యునేటర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సర్వే లోటుపాట్లు లేకుండా నిజనిర్ధారణ అయ్యే విధంగా ప్రస్ఫుటంగా సర్వేలు నిర్వహించి పేర్కొనలని తెలిపారు. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న పనులను ఇతర స్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. కూలీల సంఖ్య తో పాటు లెక్కించి హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రమణమ్మ, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, కార్యదర్శి భరద్వాజ్, జీపీ వార్డు సభ్యులు, గృహ లబ్ధిదారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



