నవతెలంగాణ – అచ్చంపేట : ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమ్రాబాద్ యందు చేరాలని ప్రిన్సిపాల్ గోపాల్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం విద్య వారోత్సవాలలో పేరెంట్ -టీచర్ మీటింగ్ ను నిర్వహించారు. ప్రిన్సిపల్ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులతో వారి పిల్లలు చదువుతున్న విధానాన్ని గురించి తెలియజేశారు. పిల్లల ఎదుగుదలకు మన ఇంటి దగ్గర చదువుకునే వాతావరణాన్ని కల్పించాలని తెలియ మరియు కళాశాలలో ఉన్న సౌకర్యాలను గురించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం మండల కేంద్రంలో అధ్యాపకులు డాక్టర్ రాధ, చంద్రయ్య, సిబ్బంది రామకృష్ణ, రాఘవేందర్ రెడ్డి, అమ్రాబాద్ మండల కేంద్రంలో పర్యటించి ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్న విద్యార్థులు తమ డిగ్రీ కళాశాలలో చేరాలని ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని విద్యార్థులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


