Thursday, May 14, 2026
E-PAPER
HomeNewsఊరుకొండలో విద్యా వారోత్సవాలు..

ఊరుకొండలో విద్యా వారోత్సవాలు..

- Advertisement -

– ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు
– గ్రామ సర్పంచ్ మ్యాకల మంజులశ్రీనివాసులు
– నాణ్యమైన విద్యా బోధన..ఎనర్జీ ఫుడ్..డిజిటల్ విద్యా విధానం
– ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి.. పిల్లల బంగారు భవిష్యత్తుకు మేముంటాం.
– గ్రామ సర్పంచ్ మ్యాకల మంజులశ్రీనివాసులు
నవతెలంగాణ – ఊరుకొండ 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో విద్యా వారోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించారు. గురువారం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా గ్రామవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోవు అంటూ ఉపాధ్యాయులు వివరించారు.

ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ పాఠశాల హెడ్‌మాస్టర్ ఆనంద్, గ్రామ సర్పంచ్ మ్యాకల మంజులశ్రీనివాసులు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పోషకాహారం, ఎనర్జీ ఫుడ్, డిజిటల్ విద్యా విధానం అందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన సీనియర్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తోందని, పేద కుటుంబాల పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రభుత్వ పాఠశాలలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -