- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట పైన గల అయ్యప్ప ఆలయంలో బుధవారం ఓనం పండగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. గురు స్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు చేసినారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూర్ ధనంజయ్, ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికే విజయ్, కోశాధికారి సురేష్ చారి, గురుస్వాములు పెర్కిట్ గంగా మోహన్, శ్రీహరి, కృష్ణ, శుభ ము, యాదగిరి, కిషన్, మహేష్, పట్టణానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



