Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి: వంగ రవి యాదవ్

స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి: వంగ రవి యాదవ్

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట : స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వంగా రవి యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ విచ్చేసి రాబోయే ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో పని చేసి ములుగు జిల్లా జెడ్పీ పీఠాన్ని మంత్రి సీతక్కకి కానుకగా ఇచ్చి, ములుగు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించాలి అని అన్నారు.

ఈ సందర్భముగా వంగ రవి యాదవ్ మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం అంటేనే కాంగ్రెస్ పార్టీ అడ్డా అని,అందులో మన జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సొంత మండలం కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేసిన రెండు సంవత్సరాల్లోనే గోవిందరావుపేట మండలానికి 25 కోట్లతో అంతర్గత రోడ్లు ఇచ్చారని,లక్నవరం సరస్సుకు గోదావరి నది జలాలు తరలించి, రైతులకు సాగునీరు కష్టాలు లేకుండా చేసింది అని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మండలంలో నాలుగు వందలకు పైగా పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతి మహిళను అభివృద్ధి చేయాలనే కాంక్ష్యతో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మద్దాలి నాగమణి, జెట్టి సోమయ్య, చింత క్రాంతి, లావుడియా జోగా, రామచంద్రపు వెంకటేశ్వర రావు, కుక్కలనాగరాజు, షర్ఫొద్దీన్, భూక్యా రాజు, సప్పిడి సతీష్, నిరంజన్ చారి, రమేష్, గుండెబోయిన రమేష్, ఓడ రాజు, బోయిని రాజు, గందే రాజు, కోగిల రాంబాబు, హాజీ పాషా, గొంది కిరణ్, అనిత, వినోద, తొడుసు కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -