Thursday, May 14, 2026
E-PAPER
Homeఖమ్మంఉద్యాన కళాశాల కు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

ఉద్యాన కళాశాల కు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

- Advertisement -

– అశ్వారావుపేటలో మరో విద్యా సంస్థకు బీజం
– ఉద్యాన కళాశాల శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– హాజరైన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
– రైతాంగ ప్రాంతానికి ఉన్నత విద్యా అవకాశాల విస్తరణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
: అశ్వారావుపేటలో మరో ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటుకు బీజం పడింది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్‌కు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షత వహించగా, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ డి. రాజిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల స్థాపనతో స్థానిక విద్యార్థులకు ఉద్యాన, వ్యవసాయ రంగాల్లో ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది. పరిశోధన, ఆధునిక సాగు విధానాలు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానం విస్తరణకు ఈ కళాశాల దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగ అభివృద్ధికి విద్య, పరిశోధన కీలకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ అశ్వారావుపేటను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గౌరవ అతిథులుగా వ్యవసాయ, సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఏపీసీ, ఆయిల్ ఫెడ్ ఎండీ, షేక్ యాస్మీన్ బాషా, ఎస్టేట్ ఆఫీసర్,  బి. నాగేశ్వర్ రెడ్డి,డీన్ ఆఫ్ హార్టికల్చర్ & డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ (ఇన్‌చార్జ్) జె.చీనా, రిజిస్ట్రార్ డా. ఎ. భగవాన్, డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ లక్ష్మీ నారాయణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎఫ్‌ఏసీ) రమేష్, శాస్త్రవేత్త (హార్టికల్చర్) & హెడ్, హెచ్‌ఆర్‌ఎస్ డాక్టర్ ఎం.శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -