న్యూఢిల్లీ: లోక్సభలో 713 ప్రయివేటు మెంబర్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు శిక్షాపరమైన నిబంధనలు, ఎన్నికల చట్టాలను సవరించాలని కోరుతున్న బిల్లులే. ఈ బిల్లుల్లో చాలా వరకు ప్రస్తుత లోక్సభ ఏర్పడిన జూన్ 2019లో ప్రవేశపెట్టగా, కొన్నింటిని ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టారు. ప్రయివేటు మెంబర్ బిల్లులు ఎంపీలు వారి వ్యక్తిగత హౌదాలో ప్రవేశపెట్టినవి. ఒక ప్రయివేట్ బిల్లును తీసుకురావడం లక్ష్యం వారు కొత్త చట్టాలను ప్రవేశపెట్టాలని, ప్రస్తుత చట్టాలలో మార్పులు అవసరమని ప్రదానంగా పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన లోక్సభ బులెటిన్ ప్రకారం, లోక్సభలో 713 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.