Friday, May 15, 2026
E-PAPER
Homeజిల్లాలుశ్రీ కనకదుర్గ దేవి 11వ వార్షికోత్సవం.. ఆహ్వాన పత్రిక ఆవిష్క‌ర‌ణ‌

శ్రీ కనకదుర్గ దేవి 11వ వార్షికోత్సవం.. ఆహ్వాన పత్రిక ఆవిష్క‌ర‌ణ‌

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్: వ‌చ్చే నెల జూన్ 25న‌ శ్రీ కనకదుర్గాదేవి శ్రీ మల్లేశ్వర స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు భక్తులు హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో అర్చకులు కిషోర్ చదివి వినిపించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ పుర ప్రముఖులు, కుల సంఘాల నాయకులు, భక్తులు శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ముందు కళ్యాణ ముహూర్త పత్రికను ఆవిష్కరించారు.

జూన్ 25వ తేదీ గురువారం గణపతి పూజ,పుణ్యావచనం, అమ్మవారికి అభిషేకం తో పూజ ప్రారంభమై, 26వ తేదీ శుక్రవారం నిత్య పూజ పారాయణం అమ్మవారి హోమం, సాయంత్రం 6 గంటలకు శ్రీ కనకదుర్గాదేవి,మల్లేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించబడును. 27వ తేదీ శనివారం నిత్యపూజ తీర్థప్రసాద వితరణ జరుగును. ఉదయం 8 గంటల నుండి మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ కొలుపుల హరినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బీజని బాలమని భాస్కర్,ఆలయ కమిటీ సభ్యులు,వివిధ కుల సంఘాల నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -