నవతెలంగాణ-ఆలేరు టౌన్: పారిశ్రామిక శిక్షణా సంస్థ ఏటీసీలో ప్రవేశాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని, పదో తరగతి పూర్తయిన విద్యార్థుల నుండి, ఇంటర్మీడియట్,డిగ్రీ విద్యాను పూర్తి చేసిన యువతి యువకులనుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏటీసీ యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల ఇన్చార్జ్, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ బి హరికృష్ణ ఆలేరులో శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యువతి యువకులు ప్రభుత్వ-ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థలలో (ఐటిఐ )/ ఏటీసీ 2026- 2027,మొదటి విడత ప్రవేశానికి దరఖాస్తులు(అడ్మిషన్స్)తేదీ 14 మే నెల నుండి, జూన్ 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు.
ఏడాది కాలవ్యవధితో పదో తరగతి అర్హతతో ఐటిఐ కోర్సులు సోలార్ టెక్నీషియన్, ఐఓటి స్మార్ట్ సిటీ , ఎలక్ట్రీషియన్ , ఫిట్టర్ రెండు సంవత్సరాలు, వెల్డర్ విద్యారహత (8వ తరగతి) ఒక సంవత్సరం, కోపా (ఎస్‌ఎస్‌సి) ఒక సంవత్సరం, వీటితోపాటు ఏటీసీ కోర్సులు సిఎన్‌సీ మెషీనింగ్ టెక్నీషియన్, (ఎస్ఎస్సి) రెండు సంవత్సరాలు, వర్చువల్ అనాలిసిస్, డిజైనర్ ఎఫ్ఈఎం(ఎస్ఎస్సి) రెండు సంవత్సరాలు, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ (ఎస్ఎస్సి) రెండు సంవత్సరాలు,ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ (ఎస్ఎస్సి) ఒక సంవత్సరం, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (ఎస్ఎస్సి) ఒక సంవత్సరం, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ మరియు ఆటోమేషన్ (ఎస్ఎస్సి) ఒక సంవత్సరం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎస్‌ఎస్‌సి,కులదృవీకరణ(క్యాస్ట్), బోనాఫైడ్ సర్టిఫికెట్లు ఒకటి నుంచి to పదో తరగతి మొదలగునవి ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవాలని ఆలేరు ప్రిన్సిపాల్/కన్వీనర్ ప్రభుత్వ ఐటిఐ
కళాశాల ప్రిన్సిపల్ హరికృష్ణ సూచించారు. ఈ అడ్మిషన్లు ఆన్లైన్ పద్ధతిన జరుపబడునని వెబ్‌సైట్ అడ్రస్ https://IT.TELAGANA.GOVERNMENT.in లాగిన్ కావాలని, మరిన్ని వివరాలకు 9866843920 ఫోన్ సంప్రదించాలని కోరారు.



