Friday, May 15, 2026
E-PAPER
Homeజిల్లాలుసమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి

సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి

- Advertisement -


నవతెలంగాణ-ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లి, తిరుమలాపూర్ గ్రామాల్లో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. గ్రామీణ ఉపాధి హామీ కూలీలు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉపాధి పని ప్రదేశంలో శుక్రవారం నిరసన చేపట్టారు. గ్రామీణ పేదలకు వ్యతిరేకమైన విబిజి గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో వరుణ్ తేజ, ఏపీవో పర్వతాలుకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని, 200 రోజుల పనిదినాలు కల్పించాలని, కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో చింతల నాగరాజు, బాలయ్య, నిరంజన్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -