Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

సర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు
సర్ ఓటరు గుర్తింపు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు బిఎల్ఓ లకు సూచించారు. గురువారం మండల పరిధిలోని కొండనాగుల గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు గుర్తింపు సర్వే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. గ్రామంలో సర్వే కార్యక్రమం ఎంతవరకు పూర్తయిందని తాసిల్దార్ శ్రీకాంత్ ను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓ లు మరియు బిఎల్ఏ లు ఎలా పనిచేస్తున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పద్మ, ఎంపీడీవో రేవతి రెడ్డి, సీఈవో రాజ వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాంప్రసాద్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు అరుణ శ్రీనివాసులు బిఎల్ఓ లు బిఎల్ఏ లు అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -