నవతెలంగాణ-అశ్వారావుపేట: అశ్వారావుపేట ఆయిల్‌పామ్ కర్మాగారంలో మిగిలి ఉన్న వార్షిక మరమ్మతుల పనుల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం నుంచి ఫ్యాక్టరీని తాత్కాలికంగా నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు రైతులు సహకరించి తమ వద్ద ఉత్పత్తి అయిన ఆయిల్‌పామ్ గెలలను అప్పారావుపేట కర్మాగారానికి తరలించాలని అధికారులు శుక్రవారం కోరారు.
అశ్వారావుపేట కర్మాగారంలో రెండు టన్నుల లోపు గెలలను మాత్రమే అన్‌లోడింగ్ చేస్తామని తెలిపారు.అప్పారావుపేట కర్మాగారంలో గెలల దిగుమతి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.రైతులు ఈ విషయాన్ని గమనించి ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రకటనను ఆయిల్ ఫెడ్ ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, అప్పారావుపేట,అశ్వారావుపేట పరిశ్రమ ల మేనేజర్ లు ఎం.నాగబాబు,ఎంఎన్ కార్తీక్, కొత్తగూడెం,ఖమ్మం డివిజనల్ అధికారులు శంకర్ లు విడుదల చేశారు.



