Saturday, May 16, 2026
E-PAPER
Homeకరీంనగర్హమాలీల సంఖ్య పెంచి, ధాన్యం అన్ లోడింగ్ చేయాలి: కలెక్టర్

హమాలీల సంఖ్య పెంచి, ధాన్యం అన్ లోడింగ్ చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల్లో సేకరించి, లారీల ద్వారా సిరిసిల్ల అపెరల్ పార్క్ లోని షెడ్ లలో నిల్వ చేయడానికి తరలించిన ధాన్యం బస్తాలను అన్ లోడింగ్ చేయడానికి హమాలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
శుక్రవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సిరిసిల్ల అపెరల్ పార్క్ లోని షెడ్ లను సందర్శించి, ధాన్యం అన్ లోడింగ్ చేస్తున్న తీరును కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు అందుబాటులో ఉన్న షెడ్ ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.

వేసవి కాలం దృష్ట్యా హమాలీల కోసం త్రాగునీరు, భోజనం, తదితర సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఎన్ని లారీలు వచ్చాయి, ఎన్ని లారీల ధాన్యం అన్ లోడ్ చేశారు అనే వివరాలను ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్ లోడింగ్ చేయాలని సూచించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సందర్శనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసీల్దార్ మహేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -