Friday, May 15, 2026
E-PAPER
Homeకరీంనగర్రైతులు ఆందోళన చెందవద్దు:ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రైతులు ఆందోళన చెందవద్దు:ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనసాగుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సిరిసిల్ల అపెరల్ పార్క్ లోని షెడ్ లలో వరి ధాన్యం దిగుమతి ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్ని లారీలు వచ్చాయి? ఎన్ని అన్లోడింగ్ చేశారు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని వారు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు ఈసారి ధాన్యం తరలింపులో లారీలు, వ్యాన్లు, ట్రాక్టర్లు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. దాన్యం దిగుమతి కోసం సిరిసిల్ల అపెరల్ పార్క్ లోని షెడ్ లలో వాడుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. ఇక్కడ హమాలీలు వెంటవెంటనే ధాన్యం దిగుమతి చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భోజన, వసతి, వైద్య సదుపాయం కల్పిస్తున్నారని వివరించారు.

రైతులెవరు ఆందోళన చెందవద్దని ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. గతంలో కంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు అందరి సహకారంతో దాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -