Friday, May 15, 2026
E-PAPER
Homeనిజామాబాద్యువతకు క్రీడా ప్రోత్సాహం..క్రికెట్ కిట్ అంద‌జేత‌

యువతకు క్రీడా ప్రోత్సాహం..క్రికెట్ కిట్ అంద‌జేత‌

- Advertisement -


నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలంలోని సుల్తాన్‌పేట్ గ్రామ యువకులకు బీజేపీ నాయకుడు ఉష్కల్వార్ రాజు క్రికెట్ ఆట వస్తువులను విరాళంగా అందించారు. గ్రామంలోని మైదానంలో శుక్రవారం యువకులకు బ్యాట్లు, స్టంప్స్ తదితర క్రికెట్ కిట్‌ను అందజేశారు. యువత క్రీడల్లో రాణించాలని, శారీరక, మానసిక దృఢత్వం సాధించాలనే ఉద్దేశంతో క్రీడా సామగ్రిని అందించినట్లు ఉష్కల్వార్ రాజు తెలిపారు. క్రీడా వస్తువులు అందించిన నాయకుడికి గ్రామ యువకులు, స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు నగేష్, బాలు, అంజాన్న, సమీర్, హన్మాండ్లు, యువ రాజ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -