- Advertisement -
భూపాలపల్లి జిల్లా డిసిఓ వాల్వా నాయక్
నవతెలంగాణ – మల్హర్ రావు:
వరిధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని భూపాలపల్లి జిల్లా సహకార సంఘం డిసిఓ వాల్వ నాయక్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,అసిస్టెంట్ రిజిస్టర్ రాజు,సిఈఓ సంతోష్ తో కలిసి కొయ్యుర్,కొండంపేట,రుద్రారం,చిన్నతూoడ్ల,మల్లారం,ఎడ్లపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్షించారు.ఈ సందర్భంగా ధాన్యం సేకరణ విధానంపై ,గన్ని సంచుల కొరత, లారీల కొరత,కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురవుతున్న పలు సమస్యలపై అరా తీశారు.
- Advertisement -



