- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ ఓటర్ దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు ప్రాముఖ్యత పై విద్యార్థులకు పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ అవగాహన నిర్వహించారు. విద్యార్థులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల విద్య సమాజానికి ఏవిధంగా ఉండాలి, చదువు యొక్క ప్రాముఖ్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థి,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



