Saturday, May 16, 2026
E-PAPER
Homeఖమ్మంనారాయణపురంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

నారాయణపురంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

- Advertisement -

నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలోని నారాయణపురం లో శనివారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మడకం కుమారి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఉపసర్పంచ్ ఆకుల శ్రీను గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్. నీలిమ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగులో శాస్త్రీయ పద్ధతుల ప్రాముఖ్యత, అధిక దిగుబడుల సాధనకు అనుసరించాల్సిన మెళకువలు, సమగ్ర పోషక నిర్వహణ, నీటి వినియోగ సామర్థ్యంపై రైతులకు అవగాహన కల్పించారు.

డా. శిరీష మాట్లాడుతూ “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యాలను వివరించారు. రైతుల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను అందించడం కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు, పంటల విభిన్నీకరణ, రైతుల ఆదాయ వృద్ధిలో శాస్త్రవేత్తల పాత్రపై వివరించారు.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు గ్రామాలకు వచ్చి రైతులతో నేరుగా మమేకమై సూచనలు ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతులు శాస్త్రీయ సలహాలను పాటించి అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షకిరా భాను, సతీష్, గ్రామ రైతులు, యువకులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -