‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి నాగ చైతన్య నటిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో 20 మిలియన్ వ్యూస్ దాటి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్పకళతో అలరారుతున్న లొకేషన్స్‌లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఉన్న భారీ విజువల్ స్కేల్‌ను చూపిస్తున్నాయి. ప్రధాన నటీనటులంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ కథలో కీలకంగా ఉండబోతుంది. ఈ స్టిల్స్ ద్వారా సినిమాకి ఉన్న మిస్టిక్ టోన్, గ్రాండియర్ మరింత స్పష్టమవుతోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. పవర్‌ఫుల్ కాంబినేషన్, భారీ సాంకేతిక ప్రమాణాలు, మైథలాజికల్ టచ్‌తో రూపొందుతున్న ‘వృషకర్మ’ స్కేల్, మిస్టరీ, సినీమాటిక్ గ్రాండియర్ కలయికగా నిలవబోతోంది అని మేకర్స్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
సరికొత్త మిథికల్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -



