లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’తో మరోమారు ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. భారత దేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొం దించబడిన ‘సింగ్ గీతం’తో అలరించ బోతున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ఒక దిగ్గజ దార్శనికుడిని, లెజండరీ నిర్మాణ సంస్థను ఒకచోట చేర్చింది. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శనివారం మేకర్స్ ఈ సినిమా నుంచి హలో బాసు సాంగ్ లాంచ్ చేశారు. మాటలే పాటగా మారిపోయే కాన్సెప్ట్ ఈ సాంగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ క్యాచీగా ఉండటమే కాకుండా, వినగానే హమ్ చేయించేలా ఉంది. సింగర్స్ వంశీ, ఆర్.పీ. కృష్ణాంగ్ తమ ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు అదిరిపోయే వైబ్ తీసుకొచ్చారు. దేవి శ్రీ ప్రసాద్‌తో పాటు ఉత్తాన భారిఘాట్ రాసిన లిరిక్స్ సరదాగా, ట్రెండీగా ఉండి యూత్‌కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మొత్తం మీద ‘హలో బాసు’ ఫన్ రైడ్‌లా మారి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ,’ఇది మాకు చాలా స్పెషల్ అకేషన్. ఈ రోజు ఒక డిలీటెడ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. ఈ పాట కోసం మా దాసు చాలా కష్టపడ్డాడు. ఇది చాలా మంచి ఫన్ సినిమా. చాలా కొత్త ప్రయోగం. సింగీతం ప్రతి సినిమాకీ కొత్తగా ఆలోచిస్తారు. ఇది ఆయన లాంగ్‌టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్` అని అన్నారు.



