Sunday, May 17, 2026
E-PAPER
Homeఖమ్మంప్రారంభం కానున్న ఉద్యాన కళాశాల 

ప్రారంభం కానున్న ఉద్యాన కళాశాల 

- Advertisement -

– ఈ ఏడాది నుంచే అడ్మిషన్స్
– 30 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్
– భవన సముదాయం కు శంకుస్థాపన మంత్రి తుమ్మల
– ఉద్యాన పంటలు సాగు కు ఊతం
నవతెలంగాణ – అశ్వారావుపేట 

వ్యవసాయ అనుబంధ రంగాల్లో పేరొందిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు ప్రభుత్వం ఉద్యాన కళాశాలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 4 కాలేజీలు ఉండగా, ఇది 5 వ ఉద్యాన కళాశాల గా నమోదు అయింది. ఈ కళాశాల భవన సముదాయం కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం శంకుస్థాపన చేసారు.

అడ్మిషన్లు ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. 30 మంది విద్యార్థులు తో మొదటి బ్యాచ్ ను ఏర్పాటు చేయను న్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ,ఉద్యాన పంటలు సాగు కు ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనది.

రాష్ట్రంలోనే మామిడి, జీడిమామిడి , పామాయిల్ సాగు కు అశ్వారావుపేట ప్రసిద్ధి చెందింది. నియోజకవర్గంలో అరుదైన పంటలు, పలు రకాల పండ్లు, కూరగాయలు, పూలతో పాటు ఆయిల్పం, కొబ్బరి, కోకో, వక్క, లవంగం, డ్రాగన్ ఫ్రూట్, దాల్చిన చెక్క వంటి పంటలు సాగవుతున్నా యి.ఔషధ మొక్కలు ఉన్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా వేలాది ఎకరాల్లో నర్సరీలున్నా యి.

వ్యవసాయ, ఉద్యాన కళాశాలల పరిశోధనలు కోసం ఎక్కువ గా ఇక్కడికే వస్తుంటారు. క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండడం ఉద్యాన కళాశాల ఏర్పాటుకు కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యాన కళాశాలను మంజూరు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటికే వ్యవసాయ కళాశాల, ఉద్యాన పరిశోధన కేంద్రం,కొబ్బరి విత్తన క్షేత్రంతోపాటు పామాయిల్ పరిశ్రమ లు ఉన్నాయి.ప్రస్తుతం ఉద్యాన కళాశాల ఏర్పాటు కానుంది. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, వనపర్తి జిల్లాలో మోజర్ల, మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల, సిద్ధి పేట జిల్లాలోని ములుగు ప్రాంతంలో ప్రాంతం లో ఉద్యాన కళాశాల లు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా, అదిలాబాద్ జిల్లాలో హార్టికల్చర్ (అగ్రి కల్చర్) పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి.

30 మందితో మొదటి బ్యాచ్..
ఉద్యాన కళాశాల భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం లో క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసామని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానుండగా, 30 మంది విద్యార్థులు తో మొదటి బ్యాచ్ను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నా రు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

ఇప్పటికే నిర్వహణలో ఉన్న వ్యవసాయ కళాశాల లో అనేక రకాల ఆహార పంటలు సాగు, అనుబంధ రంగాలు అభివృద్ధి పై విద్యాను అందిస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఉద్యాన కళాశాల లో పండ్లు, కూరగాయలు,పూల మొక్కలు, సుగంధ,ఔషధ మొక్కలు సాగు, అనుబంధ రంగాల్లో విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -