- Advertisement -
నవతెలంగాణ – కమ్మర్ పల్లి: కమ్మర్ పల్లి మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన గుడిమెల ప్రసాద్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో నూతన తహసిల్దార్ ను ఆయన చాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సుంకేట రవి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -