Monday, May 18, 2026
E-PAPER
Homeసినిమాఆధ్యాత్మిక రహస్యాలతో 'త్రికాల

ఆధ్యాత్మిక రహస్యాలతో ‘త్రికాల

- Advertisement -

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమా న‌చ్చ‌డంతో చాగంటి ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ, 'ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది అని తెలిపారు. ‘సరికొత్త కాన్సెప్ట్‌తో మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ఓ విభిన్నమైన పాత్రలో శ్రద్ధాదాస్ కనిపించబోతోంది` అని నిర్మాతలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -