Monday, May 18, 2026
E-PAPER
Homeసినిమా'బ్లాక్ మెయిల్` షురూ..

‘బ్లాక్ మెయిల్` షురూ..

- Advertisement -

వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం ‘బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో ఆదివారం ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా రచయిత, నిర్మాత కోన వెంకట్ క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, జెమిని సురేష్ తల్లి ఎం వెంకట సుబ్బలక్ష్మి మొదటి షాట్ దర్శకత్వం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ, 'మంచి ప్రాజెక్ట్ ను నమ్మి నా చేతిలో పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు అని తెలిపారు.
“నాకు దర్శకులు చాలా కాలంగా పరిచయం. ఆయన ఈ కథ చెప్పినప్పుడు మంచి కంటెంట్ తో సినిమా వస్తుంది అని అర్థం అయింది. త్వరలో షూటింగ్ మొదలవ బోతుందిఅని నటుడు వరుణ్ సందేశ్ అన్నారు. నిర్మాత అవినాష్ మాట్లాడుతూ, "నేను ఈ సినిమా రంగంలోకి రావడానికి ఒక ముఖ్య కారణం 200 కుటుంబాలకు పని కలిగించవచ్చు అని. ఇంకొకటి తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను. నా సినిమాకు వచ్చే లాభాలలో 10% మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ కి ఇస్తాను అని మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను అని చెప్పారు. పృథ్వీ రాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -