Sunday, May 17, 2026
E-PAPER
Homeసినిమాముహూర్తం కుదిరింది

ముహూర్తం కుదిరింది

- Advertisement -

చిరంజీవి మరోసారి సక్సెస్‌ఫుల్ దర్శకుడు బాబీ కొల్లి‌తో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఈనెల 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.ఈ ప్రకటనను చిరంజీవి స్వయంగా ఒక పవర్‌ఫుల్ జిమ్ వీడియో ద్వారా రివీల్ చేశారు. ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్, ఇంటెన్స్ వర్కౌట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసం ఆయన పడుతున్న కష్టం, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చేస్తున్న ట్రైనింగ్ ఈ సినిమాలో ఉండబోయే హై-వోల్టేజ్ యాక్షన్‌కు హింట్ ఇస్తోంది. వీడియోలో మెగాస్టార్ మాట్లాడుతూ, ‘గెట్టింగ్ రెడీ ఫర్ 158.. బాబీ.. ఈనెల 21 ముహూర్తం.. కెవిఎన్ ప్రొడక్షన్స్ వారిది..అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో కలుస్తున్నాం. గెట్ రెడీ` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -