రామ్ చరణ్ నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు మీడియాతో సినీ విశేషాలను షేర్ చేసుకున్నారు. మాది వ్యవసాయ కుటుంబం. విజయవాడలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వెళ్లాను. నవీన్ నా క్లోజ్ ఫ్రెండ్. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. అలా మేము సినిమాల్లోకి వచ్చాం. దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ మొత్తం అద్భుతం. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు థియేటర్‌లో కూర్చునే ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్… ప్రతిదీ ఎక్స్‌ట్రార్డి నరీగా ఉంటుంది. ప్రేక్షకుడు సినిమాలో ఏం కోరుకుంటాడో, అవన్నీ ఒక పూర్తి ప్యాకేజ్‌లా బుచ్చిబాబు అందించారు. చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. అది స్క్రీన్‌పై చూసినప్పుడే ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రేక్షకులకు అర్థమవుతుంది. సినిమా కోసం రెండేళ్ల పాటు ప్రత్యేక ట్రైనర్‌ని పెట్టుకొని వర్క్ చేశారు.
గాయాలను లెక్క చేయకుండా శరీరాన్ని హూనం చేసుకున్నారు. కంటికి కుట్లు వేసుకున్న మరుసటి రోజే షూటింగ్‌కు వచ్చారు. అది ఆయన డెడికేషన్. ఏఆర్ రెహమాన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. బుచ్చిబాబు కథ అనుకున్నప్పుడే రెహమాన్ పేరును ఫిక్స్ చేసుకున్నారు. ఆయన కథ విన్న తర్వాత మాకంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు. అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. పాటలన్నీ ఎంత అద్భుతంగా జనాల్లోకి వెళ్లాయో మనందరం చూశాం. ఈ సినిమాను మేము అనుకున్న బడ్జెట్‌లో, గ్రాండ్ స్కేల్‌లో అద్భుతంగా తెరకెక్కించాం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు అదే పాజిటివ్ ఎనర్జీతో పని చేశాం. షూటింగ్ చివరి రోజు హీరో, డైరెక్టర్ చాలా ఎమోషనల్ అయ్యారు. ట్రైలర్ వచ్చిన తర్వాత అంచ నాలు మరింత పెరుగుతాయి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా సినిమా ఉంటుంది.
ట్రైలర్ చూసిన ప్రేక్షకులు వెంటనే సినిమా చూడాలని అనుకుంటారు. అంత ఫుల్ ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది. ‘పెద్ది’ని చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా, ఓవర్సీస్‌లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ కథ విషయంలో ముందుగా గురువు సుకుమార్తో బుచ్చిబాబు షేర్ చేసుకుని ఉండొచ్చు ఏమో కానీ షూటింగ్ మొదలైన తర్వాత మొత్తం బుచ్చిబాబే చూసుకున్నారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ, టీను ఆనంద్… ఇలా ప్రతి క్యారెక్టర్ కథతో బలంగా ముడిపడి ఉం టుంది. ఆ పాత్రల్లో వాళ్లు జీవిం చేశారు. ప్రతి క్యారెక్టర్ ఇంపాక్ట్‌ను ప్రేక్షకులు బలంగా ఫీల్ అవుతారు. రత్నవేలు ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. సినిమా చాలా కలర్ ఫుల్గా ఉంటుంది. రామ్ చరణ్ సినిమా ఇవ్వడం నా అదృష్టం. ఆయన వల్లే ఇది సాధ్యపడింది. నిర్మాతగా తొలి సినిమానే ఆయనతో చేయటం మరింత ఆనందంగా ఉంది. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తున్నాను.
‘పెద్ది` ఆసాంతం మెస్మరైజ్ చేస్తాడు
- Advertisement -
- Advertisement -



