Sunday, May 17, 2026
E-PAPER
Homeసినిమాఐక్య ధైర్య సేన సమితి..

ఐక్య ధైర్య సేన సమితి..

- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా హీరో మనోజ్ మంచు , ఆయన సతీమణి మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తమ కొత్త సామాజిక సేవా సంస్థ ‘ఐక్య ధైర్య సేన సమితిని అధికారికంగా ప్రారంభించారు. ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సంస్థ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ,'నేను, మౌనిక చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నాం. సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించాం. ఈ ఆలోచన మౌనికదే. రక్తదాన శిబిరంతో పాటు ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను తీసుకెళ్తాం. ఈ సంస్థ ద్వారా ఎవరికైనా నిజమైన సహాయం అందితే, అదే మా జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం అని అన్నారు. ‘మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నేను, మనోజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం` అని మౌనిక భూమా మంచు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -