Monday, May 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడి మృతి

స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ శివారులోని వ్యాస ఫామ్ హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ మజీద్‌బండకు చెందిన యాక్సిస్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ సాయి(28) ఫామ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. ఉదయం వాచ్‌మన్ గమనించి స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు సాయిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -