Monday, May 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా

- Advertisement -

సర్పంచ్ క్రాంతి రాజ్ చావన్ 
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని సిరిపెల్లి తాండ-3 గ్రామానికి మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల కింద రూ.15 లక్షల మంజూరయ్యాయి. ఈ క్రమంలో సోమవారం స్థానిక సర్పంచ్ క్రాంతి రాజ్ చావన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్ తో కలసి గ్రామమలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామమంలో ఉన్న ప్రతి సమస్యను పరిశీలించి గ్రామ అభివృద్దికి తన వంతుగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బోస్లే నారాయణరావు పటేల్ కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని తెలిపారు. గ్రామంలో అర్హులైన  నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చూస్తామని తెలిపారు. దీంతోపాటు  ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందించేందుకు తోడ్పడు తామన్నాడు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంక బాబు,మండల కార్యదర్శి శివాజీ,ఆయా గ్రామాల సర్పంచులు మారుతీ, భోజరం పటేల్,క్రాంతి రాజ్,గోకుల్, సంజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -