- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన సంతోష్ పటేల్ సోమవారం వారి తండ్రి కీర్తి శేషులు దేవీదాస్ పటేల్ జ్ఞాపకార్ధం గ్రామానికి పాడే వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బాలరాజ్,మరియు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు బస్వంత్ రావ్ పటేల్ , మధుకర్ పటేల్ ,సంజు మహారాజ్, బాలాజీ పటేల్ ,సెక్రటరీ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ పటేల్ గతంలో కూడా సుల్తాన్ పేట్ పాఠశాలలో సీసీ కెమెరాలు, విద్యార్థులకు ప్లేట్ లు పంపిణీ చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు.
- Advertisement -



