గ్రామ సర్పంచ్ కంతి మధు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని శారాజీపేట గ్రామ సర్పంచ్ కంతి మధు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మే 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న యూత్ అండ్ స్పోర్ట్స్ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో వాక్‌థాన్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, గ్రామస్థాయి నుంచి క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అనంతరం ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.రోజువారీ జీవితంలో వ్యాయామం, క్రీడలను భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందితే సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూడల శ్రీధర్, గ్రామ శాఖ అధ్యక్షులు చిలుకు నాగరాజ్, పాలకవర్గ సభ్యులు బండ శ్రీను, దూడల సుమలత, సంతోష్, కంతి బిక్షపతి, కంతి బాలరాజ్, చిలుకు ప్రశాంత్, పెండ్యాల నాగరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య,గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న,వి.బి.కె సఫియా, భాగ్యతో పాటు గ్రామ యువత దూడల శ్రీను, కంది మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



