పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్, గోంగ్లి మండల పరిధిలోని వైన్ షాపులలో నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఒక వ్యక్తికి కనీసం 1-3 బాటిల్స్ వరకు మాత్రమే అమ్మాలని ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ పవన్ గౌడ్ తెలిపారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి తలకిందులుగా ఉంది. ఒక్కొక్కరు డజన్ల కొద్దీ, కాటన్ లనే తీసుకెళ్లిపోతున్నారు. అంతేకాదు వైన్ షాపు యజమానులు బెల్టు షాపులకు కాటన్ల కొద్దీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో మద్నూర్, రాచూర్, అవల్గావ్, తదితర గ్రామాల్లో మద్యాన్ని నిషేదించాలని సర్పంచ్ లతో పాటు గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా కిరాణా షాపుల్లో మద్యాన్ని విక్రయిస్తే రూ.20 జరిమానా విధించాలని తీర్మాణం చేశారు. ఇందులో భాగంగా డోంగ్లీ తహశీల్దార్ రంజిత్ కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా నిబంధనల విషయమై వైన్ షాపు ముందు త్వరలోనే బ్యానర్లు ఏర్పాటు చేయిస్తామని వారు స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన వైన్స్ యాజమాన్యాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



