Monday, May 18, 2026
E-PAPER
Homeకరీంనగర్20న బందుకు సహకరించాలి

20న బందుకు సహకరించాలి

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను నియంత్రించాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న తలపెట్టిన మెడికల్ ల బందును విజయవంతం చేయాలని రాయికల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసిల్దార్ నాగార్జున,ఎస్సై సుధీర్‌రావులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గరిపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మందులు అవసరమైన వారు ఒక రోజు ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. బందుకు ప్రతి మెడికల్ అసోసియేషన్ సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిరిపురం గణేష్,సభ్యులు గడ్డల శ్రీనివాస్,రంజిత్,నాగమల్ల శ్రీకర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -