- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
స్వయం ఉపాధి ఆర్థిక సహాయ పథకాల కింద ఎస్సీ,మైనారిటీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపికకు సోమవారం రాయికల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఎంపీడీవో బింగి చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకర్లతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఎస్సీ కార్పొరేషన్‌కు మొత్తం 48 మంది దరఖాస్తు చేసుకోగా 43 మంది హాజరయ్యారని,మైనారిటీ కార్పొరేషన్‌కు 40 మంది దరఖాస్తు చేసుకోగా 37 మంది ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



