Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -

 నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
వివిధ సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి, వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 51 అర్జీలను స్వీకరించారు.  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. 

అందులో రెవిన్యూ శాఖ 32,హౌసింగ్ 5, జిల్లా సంక్షేమ శాఖ 3, మున్సిపాలిటీ 2, సర్వే ల్యాండ్ 2, గ్రామీణ అభివృద్ధి 2, పంచాయతీ , ఎక్సైజ్, ఇరిగేషన్, చేనేత జౌళి,జిల్లా పరిషత్ శాఖలకు ఒక్కటి  చొప్పున వచ్చాయని తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్  సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. స్టేట్ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,  జడ్పీ సీఈవో శోభారాణి,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -