Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లంబాడి హక్కుల పోరాట సమితి మహాధర్నాను విజయవంతం చేయాలి

లంబాడి హక్కుల పోరాట సమితి మహాధర్నాను విజయవంతం చేయాలి

- Advertisement -

–  మూడవత్ రాంబల్ నాయక్
నవతెలంగాణ – కామారెడ్డి

ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న లంబాడి హక్కుల పోరాట సమితి మహాధర్నాను విజయవంతం చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మహాధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మూడవత్ రాంబల్ నాయక్ మాట్లాడుతూ..గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు 12 హామీలు ఇచ్చిందని, వాటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా లంబాడీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదని విమర్శించారు. లంబాడీలకు గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని, తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామపంచాయతీకి సంవత్సరానికి రూ.25 లక్షలు కేటాయించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది రూ.1000 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈనెల 26న జరిగే మహాధర్నాకు లంబాడీలు పార్టీలకతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ జాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ జాదవ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్‌సింగ్ రాథోడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సభావత్ శంకర్ నాయక్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు ప్రకాష్ మాలోత్, పీర్‌సింగ్ నాయక్, జబ్బర్ నాయక్, విస్లావత్ గోపి, రమేష్ రాథోడ్, బన్సీ నాయక్, శంకర్ నాయక్, వినోద్ నాయక్, హాజీ నాయక్, రాజు నాయక్, అంబర్ సింగ్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -