- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హక్కుల సాధన కోసం ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్లడించింది. సోమవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఛాంబర్ ప్రతినిధులు మాట్లాడారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిలిపేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలను నివారించాలనే డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
- Advertisement -



