విధిలోన ఉండుటే అధికారి పనిగాదు
మనము జెప్పిన మాట వినగవలెను
రూల్సు గీల్సూ అంటూ ఫాల్సుమాటలు చెప్తె
తుప్పలూ తంగెళ్లు తప్పవౌర
సిట్టంటె కూర్చొని స్టాండంటె నిలుచునే
అధికారులే మాకు అవసరమ్ము
కాని పనులు గూడ ఖచ్చితంబుగ జేసి
మెప్పించు వారలే మేలు మాకు
అట్టి వారినె గూర్చుండ బెట్టుతాము మంచితావుల నన్నింటి నెంచి చూసి మాట విననోన్కి ఓ మూల సీటుజూసి
ఉనికి లేనట్టి పోస్టులో వేతుమోయి
– ఏనుగు నరసింహారెడ్డి