Tuesday, May 19, 2026
E-PAPER
Homeజాతీయంఆర్థిక సవాళ్లపై మోడీకి ముందు చూపులేదు: మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

ఆర్థిక సవాళ్లపై మోడీకి ముందు చూపులేదు: మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మోడీ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ అగ్ర‌నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ పాల‌న‌లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ విఫ‌ల‌మైంద‌న్నారు. అందుకు నిద‌ర్శం ఇంద‌న‌ధ‌ర‌లు పెంపు నిద‌ర్శ‌మ‌ని బెంగళూరు మీడియా స‌మావేశంలో పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రికి అవసరమైన ముందుచూపు, దూరదృష్టి కొరవడింద‌న్నారు.

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి నిరంతరం విలువ కోల్పోవడంపై కాంగ్రెస్ అధినేత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడుతుందని హెచ్చరించారు.

‘పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పదేపదే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. జరుగుతున్న ఈ పరిణామాల గురించి నేను మోదీజీని అడగాలనుకుంటున్నాను, మీరు వీటిని ముందుగా ఊహించలేదా? వీటి గురించి మీరు ఏమాత్రం ఆలోచించలేదా? ఒకవైపు మనం ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ పూర్తిగా తెలిసినప్పటికీ, మన దేశంలో ఎలాంటి సమస్య లేదు, అంతా బాగానే ఉంద‌ని ప్రధాని మోదీ అన్నారు,” అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమ‌ర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -